యూనిట్

పోలీస్‌ దర్బార్‌కు విశేష స్పందన

పోలీస్‌ దర్బార్‌కు విశేష స్పందన శ్రీకాకుళం జిల్లా ఆర్మ్‌డ్‌ రిజర్వు కార్యాలయ ఆవరణలోని పోలీస్‌ కళ్యాణ మండపంలో జిల్లా ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి దర్బార్‌ నిర్వహించారు. ఈ సందర్బ Ûముగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల సమస్యలు తీర్చడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులు నిబంధనల మేరకు కచ్చితంగా అమలు చేయనున్నట్లు పేర్కొ న్నారు. వారాంతపు సెలవులను విధిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ పోలీస్‌ విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది తమ సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా వీలైనంత త్వరగా సమస్యలన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అనంతరం తిరుపతిలో జరిగిన ఓపెన్‌ రాష్ట్ర స్థాయి స్పోర్ట్సు మీట్‌ లో నాలుగు బంగారు పతకాలు సాధించిన కానిస్టేబుల్‌ ఎస్‌.కాంతారావును అభినందించారు. కార్యక్రమంలో డిఎస్పీ శేఖర్‌, ఆర్‌ఐలు కోటేశ్వరబాబు, రవికుమార్‌, శ్రీనివాస్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని