యూనిట్

అనంతపురం ప్రయివేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశం

పోలీసు సిబ్బంది సంక్షేమంలో భాగంగా  పోలీసు ఆరోగ్య భద్రత అమలుపై అనంతపురం జిల్లా కేంద్రంలోని ప్రయివేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో బుధవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ట్రైనీ ఐ.పి.ఎస్ అధికారి మణికంఠ చండోలు, అదనపు ఎస్పీ జి.రామాంజినేయులు, ఏ.ఆర్ డీఎస్పీ ఎన్ మురళీధర్ లు ప్రయివేట్ ఆసుపత్రుల యాజమాన్యాలుతో ముఖాముఖిగా మాట్లాడారు. ఆరోగ్య భద్రత అమలు తీరు, బిల్లుల చెల్లింపు, తదితర అంశాలుపై ఆరా తీశారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అత్యవసర పరిస్థితుల్లో రికార్డుల పేరున జాప్యం చేయకుండా భద్రత కార్డు అందజేసిన వెంటనే మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్న సమయాల్లో ఆ కుటుంబ సభ్యులు అనారోగ్య కారణాలు, అత్యవసర పరిస్థితులతో ఆసుపత్రుల్లో చేరే సమయంలో సమయం వృథా చేయకుండా సత్వరమే స్పందించి వైద్య సేవలు చేయాలని జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ కోరారు. ఈసమావేశంలో స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ఎ.రామచంద్ర, సి.ఐ బి.వి.శివారెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , జాఫర్ , సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్ , శివప్రసాద్ , శ్రీనివాసులనాయుడు, తేజ్ పాల్ , రమణ, శివ మరియు సవీర, నేత్ర, స్నేహలత, జయం, వై.ఎస్ .ఆర్ , అక్బర్ కంటి ఆసుపత్రి, తదితర ఆసుపత్రుల నుండీ వచ్చిన ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని