యూనిట్
Flash News
కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ పై స్పెషల్ డ్రైవ్

జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారి
ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన
కర్నూల్ జిల్లా పోలీసులు.
• గౌరవ
డి.జి.పి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా పోలీసు అధికారులు, పోలీసు బృందాలు, ఐసిడిఎస్, ఎన్ జి ఓ సభ్యులు జిల్లా వ్యాప్తంగా విస్తృత
తనిఖీలు.
• జిల్లా
వ్యాప్తంగా 362 మంది (310 బాలురు, 52 మంది బాలికలు) వీధి, అనాధ బాలలను బాలలను రెస్క్యు చేసిన జిల్లా పోలీసులు
.
• పిల్లలను
అనాథలుగా వదిలివేయ కూడదు... బాల కార్మికులుగా పని చేయించకూడదు.. పిల్లలను బాగా
చదివించుకోవాలని... పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించి
కౌన్సిలింగ్ నిర్వహించిన.... జిల్లా ఎస్పీ.
కర్నూలు, జనవరి 04. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డి.జి.పి గారి ఉత్తర్వుల
మేరకు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు జిల్లా వ్యాప్తంగా
అన్నీ పోలీస్ స్టేషన్ పరిధిలలో “ఆపరేషన్ ముస్కాన్”
నిర్వహించాలని జిల్లా పోలీసు అధికారులకు తెలియజేయడం జరిగింది.
రాష్ట్ర
వ్యాప్తంగా చేపట్టిన “ఆపరేషన్ ముస్కాన్” లో భాగంగా జిల్లాలో తప్పిపోయిన బాలలతో
పాటు రైల్వే స్టేషన్ లు, బస్
స్టాండ్ లు, ప్లాట్
ఫారాలు, హోటల్
లు, డాబాలు, ఆటో గ్యారేజీలలో బాల కార్మికులుగా మార్చబడిన 14 సంవత్సరం
లోపు వీధి, అనాధ
బాలలను గుర్తించడం జరిగింది.
ఈ
సంధర్బంగా శనివారం మధ్యాహ్నం కర్నూలు రెండవ పట్టణ పోలీసుస్టేషన్ లో జిల్లా ఎస్పీ
డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు విలేకరుల సమావేశం నిర్వహించి
మాట్లాడారు. కర్నూలు జిల్లాలో 79 పోలీసుస్టేషన్
ల పరిధులలో
శనివారం ఉదయం నుండి ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టడం
జరిగిందన్నారు. ఈ రోజు ఉదయం నుండి మధ్యాహ్నం ఒంటి
గంట వరకు 362 మంది అనాథ, వీధి
బాలలను రక్షించడం జరిగిందన్నారు. ఇందులో 310 బాలురు, 52 మంది బాలికలు ఉన్నారన్నారు.
కర్నూలు
సబ్ డివిజన్ పరిదిలోనే 54 మంది బాలలను రక్షించి వారి తల్లిదండ్రులకు
అప్పగించడం జరిగిందన్నారు. చిన్న పిల్లలను (హోటళ్ళు, ఆటో
గ్యారేజ్ , డాభాలలో
తదితర ప్రదేశాలలో) ఎక్కడా కూడా బాల కార్మికులుగా పని చేయించకూడదు అని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. తల్లిదండ్రులు ఉండి కూడా
పిల్లలను అనాథలుగా వదిలివేస్తున్న తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ చేస్తున్నామన్నారు.
పిల్లలను బాగా కష్టపడి చదివించాలని తెలియజేస్తున్నామన్నారు. ఐసిడిఎస్, ఎన్
జీ ఓల సహాకారం కూడా తీసుకుంటున్నామన్నారు. ఆపరేషన్ ముష్కాన్ లో రక్షించిన
ప్రతి ఒక్క బాల, బాలికలకు సంబంధించిన వారి వివరాలను
పోలీసుస్టేషన్ రికార్డులలో నమోదు చేస్తున్నామన్నారు. వారు ఏ పని కోసం వచ్చారు, ఏ
ప్రాంతం నుండి వచ్చారు, ఎందుకు
వచ్చారు, ఎప్పటి నుండి ఇక్కడ ఉన్నారు. వారికి ఎలాంటి సమస్యులున్నాయో
తెలుసుకుని వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నామన్నారు. అనాథలుగా ఉన్నట్లయితే ఎన్ జి ఓలకు అప్పగిస్తున్నామన్నారు. ఎన్ జి ఓలు అనాథ పిల్లలకు సరైన సదుపాయాలు కల్పించే విధంగా కూడా చర్యలు
తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ లోనే భాగంగానే కర్నూలు జిల్లాలో కూడా ఆపరేషన్ ముష్కాన్ చేపట్టడం జరిగిందన్నారు.
ఈ
కార్యక్రమంలో ట్రైనీ ఐపియస్ శ్రీ తుషార్ డుడి , కర్నూలు పట్టణ డిఎస్పీ శ్రీ బాబా ఫకృద్దీన్ గారు, కోడుమూరు సిఐ శ్రీ పార్ధసారథి రెడ్డి, 2 టౌన్ ఎస్సై శ్రీ జగన్, ఐసిడిఎస్ శ్రీమతి శారద, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శ్రీమతి విద్యావతి ఉన్నారు.