యూనిట్

పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో పక్కాగా స్పందన

పశ్చిమ గోదావరి జిల్లా, ది. 20.01.2020 సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ నవదీప్ సింగ్ గ్రేవల్ ఐపియస్ గారు ఉదయం 10.30 గంటల నుండి స్పందన కార్యక్రమం నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి, వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా  ఉన్న అన్ని సబ్ డివిజన్ ల నుండి ఫిర్యాదులు  వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న ఆయా స్ధానిక పోలీస్ స్టేషన్ అధికారులతో Live Video streaming ద్వారా ఎస్పీ గారు మాట్లాడి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసుస్టేషన్ అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, నిర్దేశించిన గడువు లోగా  ఫిర్యాదు దారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ నవదీప్ సింగ్ గ్రేవాల్ ఐపియస్ గారు ఈ సంధర్బంగా ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో యస్.బి డి.యస్.పి కె. శ్రీనివాసాచారి పోలీస్ లీగల్ అడ్వైజర్ కే.గోపాల కృష్ణ  హాజరైనారు.

    ఈ సందర్భముగా కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్న కేసులు ఎక్కువగా వస్తున్నట్లు ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాల నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఎవరి యొక్క సిఫార్సులు గాని పైరవీలు గాని ఉద్యోగ నియామకాలకు చెల్లవని గమనించాలన్నారు. పశ్చిమగోదావరి జిల్లా అంతటా మహిళల సంరక్షణ కొరకు డయల్ 100  కి వచ్చే ఫిర్యాదులపై సత్వర న్యాయం చేస్తూ మహిళా సంరక్షణ కొరకు తీసుకోవలసిన అన్ని రకములైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వారి నుండి వచ్చే  పథకాలలో వస్తున్న ఆర్థికపరమైనటువంటి లబ్ధిదారులకు సదరు పథకాల యొక్క అధికారులు  అని చెప్పిఫోను చేసి మీ అకౌంట్ నెంబరు IFS కోడు మరియు మీకు ఒక ఓటిపి వస్తుంది అని మీకు ఎవరైనా కాల్ చేస్తే..దయచేసి ఎవరు కూడా  ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండని జిల్లా ప్రజలకు విజ్నప్తి చేసారు. ప్రభుత్వం వారి వద్ద నుండి డబ్బు బ్యాంక్ ఎకౌంట్ నందు పడింది అనుకుని మీరు మీ యొక్క అకౌంట్ నెంబరు పిన్ నెంబరు ఓటీపీ నెంబర్ చెప్పిన యెడల మీ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు మాయం అవడం ఖాయం తస్మాత్ జాగ్రత్త అని పత్రికా ప్రకటన ద్వారా ఎస్పీ గారు  తెలియపర్చినారు. 

వార్తావాహిని