యూనిట్

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ

పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కడప జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఉమేష్‌ చంద్ర కళ్యాణ మండపంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయాల్లో రక్తం లభించక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం వలన ఇంకొందరికి ప్రాణ దానం చేసినవారమౌతామన్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రిమ్స్‌ వైద్యాధికారులతో మాట్లాడామని, పోలీస్‌ సంక్షేమ వైద్యశాలల నుంచి 50 యూనిట్ల రక్తం అందుబాటులో ఉంచి ఆపదలో ఉన్నప్పుడు సమాచారం ఇంచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏ.ఆర్‌.ఆదనపు ఎస్పీ రుషికేశవరెడ్డి, డిఎస్పీలు సూర్యనారాయణ, రిమ్స్‌ వైద్యశాల సూపరెంటెండెంట్‌ డాక్టర్‌ గిరిధర్‌, కడప పోలీస్‌ సంక్షేమ వైద్యాధికారి డాక్టర్‌ సమీర ఇతర అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.

వార్తావాహిని