యూనిట్

రక్తదానం శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం ఆస్మీ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్‌ కన్వెన్షన్‌ హాల్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భముగా ఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్‌ 15 నుండి 21వ తేదీ వరకు పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేటపట్టినట్లు పేర్కొన్నారు. రక్తదానం చేసి రక్తదాతలు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర వైద్యసేవలు పొందే వారికి రక్తం ఎంతో అవసరమని, దీన్ని అందరూ గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో ఓఎస్‌డి కె.ఆరిఫ్‌ హఫీజ్‌, హోంగార్డ్స్‌ ఆర్‌.ఐ వై.రవికిరణ్‌, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని