యూనిట్

స్వాట్‌ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన ఎస్పీ

ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఆర్‌.ఎస్సైలకు మరియు 24మంది కానిస్టేబుళ్ళకు ఆయుధాలు మరియు నిపుణత్వము (స్వాట్‌)పై జిల్లా పోలీస్‌ శిక్షణ కేంద్రంలో ఆక్టోపస్‌ వారిచే శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ శిబిరాన్ని జిల్లా ఎస్పీ సిద్దార్ధ్‌ కౌశల్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైడ్స్‌, వెతుకుటలో అవలంభించాల్సిన టాక్సిక్స్‌ను, ఉగ్రవాదులను పట్టుకోవడంలో మెళకువలను నేర్పిస్తారన్నారు. ప్రతి ఒక్కరు శిక్షణను ఉపయోగించుకుని నైపుణ్యాలను మెరుగు పర్చుకుని అసాంఘిక శక్తులను ఎదుర్కొనుటలో మెరుగైన ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎస్‌.బి సి.ఐ బాలమురళీకృష్ణ, ఒంగోలు తాలుకా సి.ఐ కె.లక్ష్మణ్‌, హోంగార్డ్సు ఆర్‌.ఐ యు.నాగేశ్వర రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని