యూనిట్

విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు

శుక్రవారం నెల్లూరు  జిల్లా యస్.పి.  భాస్కర్ భూషణ్,    జిల్లాలోని ఆంధ్ర తమిళనాడు బోర్డర్ పెద పన్నంగాడు నుండి ప్రకాశం బోర్డర్ చేవూరు చెరువు వరకు గల నేషనల్ హైవే మీద 24 గంటలూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న 10 హైవే మొబైల్స్ మరియు ఒక ఇంటర్ సెప్టర్ వెహికల్ డ్రైవర్స్ యొక్క పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  హైవే మొబైల్స్ పార్టీలతో మాట్లాడుతూ విధినిర్వహణలో అలసత్వం వహిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  హెల్ఫ్ లైన్ ల ద్వారా అందే కాల్స్ కు మెరుపు వేగంతో స్పందించి రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారిని రక్షించాలని సూచించారు.  హైవేల మీద, డాబా హోటల్స్ వద్ద ఎట్టి పరిస్థితులలో వాహనాలు రోడ్డు మీద పార్కింగ్ చేయరాదని, అలా పార్కింగ్ చేయబడిన వాహనాలను ఆ పరిధిలోని యస్. ఐ. ల సహకారంతో వెంటనే సీజ్ చేయాలని తెలిపారు.  హైవే పరిధికి లోబడి మాత్రమే విధులు ఎల్లవేళలా నిర్వహించాలని, లోకల్ పోలీసు అధికారులు చెప్పారని హైవే వదిలి ఎట్టి పరిస్థితులలో వెళ్లకూడదని హెచ్చరించారు. 

                        హైవే మీద రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు కిడ్నాప్ లు, దొంగతనాలు మరియు ఇతర నేరాలు జరిగినపుడు మొబైల్ పార్టీలు అన్నీ కూడా కంట్రోల్ రూం ఆదేశాలను అనుసరించి సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. అందరూ కాల్ సైన్ కు సత్వరం స్పందించాలని, వారి వారి పరిధిలలో మొబైల్ విజిబులిటీ గణనీయంగా పెంచాలని, అన్నీ మొబైల్స్ కదలికలను ఎప్పటికప్పుడు  జి పి ఎస్ ద్వారా  ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు.  విధులలో నిర్లక్ష్యం వహించనా, నిజాయితీని విస్మరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని  తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా   డి.యస్.పి.(ఏ.ఆర్)   వై.రవీంద్ర రెడ్డి ,  ఆర్ ఐ వెల్ఫేర్  చంద్ర మోహన్, ఎం టి ఓ  గోపి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని