యూనిట్

పోలీసుల గొప్పతనాన్ని వివరించే చిత్రం: ఎస్పీ

పోలీసులు గొప్పతనాన్ని వివరించే చిత్రమే 'ఠాణా' అని విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయం నందు సునయనా క్రియేషన్స్ బ్యానర్ పై, షమీమ్ భాషా దర్శకత్వం లో నిర్మించబడిన  'ఠాణా' చిత్రం పోస్టర్లు, టైటిల్, డెమోలను ఆవిష్కరించారు.  అనంతం ఆమె మాట్లాడుతూ పోలీసుల గూర్చి అవగాహనా వున్నా వారు, సహాయాన్ని పొందిన వారు దైవంగా భావిస్తే, చట్టాన్ని అమలు చేసే క్రమంలో పోలీస్ ల నుండి ఇబ్బందులు ఎదుర్కొన్న వారు శత్రువులుగా భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఓ ఎస్ డి జె. రామ్మోహన రావు, డిఎస్పీలు పి. వీరాంజనేయ రెడ్డి, సి ఎం నాయుడు, ఎల్ మోహన రావు తదితరులు పాల్గొన్నారు. 

వార్తావాహిని