యూనిట్

రోడ్డు మరియు సైబర్‌ అవగాహన కేంద్రాన్ని ప్రారంభించిన ఎస్పీ

రోడ్డు ప్రమాదాలు మరియు సైబర్‌ నేరాల నియంత్రణ కొరకు అవగాహన కల్పించేందుకు గాను రోడ్డు మరియు సైబర్‌ అవగాహన కేంద్రాన్ని విజయనగరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ శ్రీమతి బి.రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ భద్రతా నియమాలు పాటించని కారణంగా రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది అర్దంతంగా ప్రాణాలను కోల్పోతున్నారు, వారి కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయన్నారు. పోలీసుల ముఖ్య ఉద్దేశ్యం ప్రజల నుండి చలానాలు వసూలు చేయడం కాదు, వారికి అవగాహన కల్పించి, రోడ్డు నిబంధనలు పాఠించే విధంగా చేయడమన్నారు. సైబర్‌ నేరాలు ప్రజల అవగాహనా రాహిత్యంవలనే జరుగుతున్నాయన్నారు. లాటరీలు వచ్చాయని, బ్యాంకలనుండి మాట్లాడుతున్నామని, ఎటిఎం మోసాలను నియంత్రించేందుకు సైబర్‌ నేరాలపట్ల ప్రజలకు ఈ కేంద్రం ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్‌. శ్రీదేవి, ఓఎస్‌డి రామ్మోహనరావు, ట్రాఫిక్‌ డిఎస్పీ ఎల్‌.మోహనరావు, డిఎస్పీలు పి. వీరాంజనేయ రెడ్డి, సి.ఎం. నాయుడు, జె. పాపారావు మరియు ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని