యూనిట్
Flash News
గ్రామ/వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ

విజయనగరం జిల్లా సరిపల్లిలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 3 వ బ్యాచ్ గ్రామ / వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్సుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి రాజకుమారి ప్రారంభించారు. అనంతరం ఆమె వారినుద్దేశించి మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో మహిళా సమస్యలను ఇతరత్రా వేధింపులను క్షుణ్ణంగా తెలుసుకొని, వాటిని పోలీసులు దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించేలా కృషి చేయాలన్నారు.మహిళలు, బాలికలు ఆత్మ విశ్వాసం గా జీవించేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి జె. మోహనరావు, డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి, డిఎస్పీ (డిఎస్బి) సి ఎం నాయుడు, ఏఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, సిఐ లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.