యూనిట్
Flash News
ఎస్.పి. అన్బురాజన్ చొరవతో రోడ్డు పునరుద్ధరణ
వర్షానికి రోడ్డు బాగా దెబ్బతినింది, దీనికి తోడు డ్రైనేజీ నీళ్ళు రోడ్డుపై నిలిచి చెరువులను తలపించేలా ఉన్నాయని మా ఊరుకు రోడ్డు సౌకర్యం బాగాలేదని తిమ్మినాయుడు పాలెంకు చెందిన ప్రజలు ఎస్.పి. అన్బురాజన్‌కు ఫోన్‌చేసి సమస్యలు విన్నవించారు. స్పందించిన ఎస్.పి. వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడారు. ట్రాఫిక్ సిఐ సురేష్‌కుమార్‌కు రోడ్డు పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. దీంతో సీఐ సురేష్‌కుమార్ గ్రామస్థుల సహకారం తీసుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న వాటిని తొలగించి, ప్రొక్లైన్ సాయంతో తిమ్మినాయుడుపాలెంకు రోడ్డు మరమ్మతులు చేయించారు. ఎస్.పి. సహకారానికి గ్రామప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.