యూనిట్

టోల్ ఫ్రీ నంబర్ 14400 సేవలు విరివిగా వినియోగించుకునేలా చైతన్యం తీసుకురండి

 అవినీతి నిర్మూలనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టోల్ ఫ్రీ నంబర్ 14400 సేవలను ప్రజలు విరివిగా వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావాలని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పిలుపునిచ్చారు. అవినీతి నిరోధక శాఖ ముద్రించిన " టోల్ ఫ్రీ నంబర్ 14400 " పోస్టర్లను ఆయన సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన ఛాంబర్లో  ఆవిష్కరించారు. ఈ పోస్టర్లను ప్రతీ పోలీసు స్టేషన్లకు పంపుతామని... పోలీసు కార్యాలయాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఈ పోస్టర్లను అతికించాలని సూచించారు. అంతేకాకుండా ప్రజల్లో అవినీతి నిర్మూలనపై అవగాహన తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.రామాంజినేయులు, ఏ.సి.బి  ఇన్ స్పెక్టర్   ప్రభాకర్ గౌడ్ లు పాల్గొన్నారు.

వార్తావాహిని