యూనిట్

2019 ఉత్తమ ఎన్నికల ప్రాక్టీస్‌ జాతీయ అవార్డుకు నామినిగా ఎన్నికైన ఎస్‌.పి. ఫక్కీరప్ప

కర్నూలు జిల్లా  ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లికు భారత ఎన్నికల సంఘం ''బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీస్‌ జాతీయ అవార్డు 2019''కి నామినిగా ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో 50 మంది అధికారులను జాతీయ అవార్డులకు నామినేట్‌ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుండి  నలుగురు అధికారులు నామినేట్‌ అయ్యారు. ఇద్దరు ఐపియస్‌ అధికారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ''ఎన్నికల నిర్వహణ'' కోసం ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ఎన్నికల నోడల్‌ అధికారిగా పని చేసిన అదనపు డీజీపీ డాక్టర్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఎంపికయ్యారు. ''స్పెషల్‌ కేటగిరి క్రింద ఐటీ ఇన్‌ సియోటివ్‌ స్పెషల్‌ కేటగిరి విభాగంలో కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప కాగినెల్లి స్పెషల్‌ కేటగిరి అవార్డుకు నామినిగా ఎంపిక అయ్యారు. 2019 సంవత్సరానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికల విధులలో ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు ''బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీస్‌ జాతీయ అవార్డు 2019''కి  నామినిలుగా ఎంపిక చేసి భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా)  ప్రకటించింది.

వార్తావాహిని