యూనిట్

ప్రకాశం జిల్లా పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఎస్పీ

ప్రకాశం జిల్లా అన్ని విభాగాల పోలీస్‌ అధికారులతో జిల్లా ఎస్పీ సిద్దార్ధ కౌశల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం గుంటూరు రేంజ్‌ ఐజి వినీత్‌ బ్రిజ్‌లాల్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి జిల్లాలోని అన్ని పోలీస్‌ కార్యాలయాలకు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. గుంటూరు రేంజ్‌ ఐజి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డోర్నాల ఎస్సైతో మాట్లాడారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నెట్‌వర్క్‌ సమస్యలు వున్నప్పటికీ మొత్తం జిల్లాలో 95శాతం వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో మాట్లాడుటకు సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో సెల్‌ఫోన్‌, ల్యాప్‌ టాప్‌ల ద్వారా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి శాంతి భద్రతల పరిస్థితులను తెల్సుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డిఎస్పీలు వి.ఎస్‌.రాంబాబు, శ్రీనివాసాచారి, సి.ఐ బాలమురళీకృష్ణ, ఎన్‌.శ్రీకాంత్‌ బాబు, వై.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని