యూనిట్
Flash News
సౌత్ ఎమన్ దేశానికి చెందిన మత్తు పదార్థ విక్రేత అరెస్టు
గుంటూరులోని ప్రైవేట్
యూనివర్సిటీ విద్యార్ధులకు మత్తు పదార్ధాలు అమ్ముతున్న విక్రయదారులను మరియు
కొనుగోు దారును అరెస్టు చేసినట్లు గుంటూరు అర్భన్ ఎస్పీ పి.హెచ్.డి. రామకృష్ణ
తెలిపారు. కేసు వివరాను ఆయన వ్లెడిరచారు. సౌత్ ఎమన్ దేశానికి చెందిన మహమ్మద్
షాద్ అహమ్మద్ మెహసేన్ బెంగూళూరు నుండి సిరియా
దేశానికి చెందిన ఆల్ మొహిమ్మద్ అరాఫత్ ద్వారా గంజాయి, ఎక్స్‌టాసి
పిల్స్ మరియు వైట్ క్రిష్టల్ వంటి మత్తుపదార్ధాను తెప్పిస్తున్నాడు. వాటిని
స్థానికంగా వున్న ఓ ప్రైవేట్ యూనివర్సిటి విద్యార్ధుకు విక్రయిస్తున్నాడు.
మహమ్మద్ షాద్
అహమ్మద్ మెహసేన్ విజయవాడలో వుంటూ ప్రైవేట్ యూనివర్సిటీలో బిబిఎ చదువుతున్నాడు.
తన వీసా గడువు ఏప్రిల్ నాటికి పూర్తి అయినప్పటికీ అక్రమంగా నివాసం వుంటూ మాదక
ద్రవ్యా వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. మహమ్మద్
షాద్ అహమ్మద్ మెహసేన్ మాదక ద్రవ్యాను యూనివర్సిటి విద్యార్ధులైన షేక్ నాగూర్
షరీఫ్, చెరుకు వెంకట సూర్య కుమార్ రెడ్డి, పాలెం అవినాష్ తో పాటు మరికొంత మందికి మత్తు మందును సరఫరా చేస్తు వారిని
మాదకద్రవ్యా బానిసుగా మారుస్తున్నాడు.
ప్రధాన నిందితుడైన మహమ్మద్
షాద్ అహమ్మద్ మెహసేన్ తన ద్విచక్రవాహనంపై గుంటూరు `నల్లపాడు
రోడ్డులో వెళ్తుండగా వాహన తనిఖీు నిర్వహిస్తున్న పోలీసుకు దొరికాడు. అతనిని
విచారించి వివరాలు సేకరించిన అనంతరం మహమ్మద్ షాద్ అహమ్మద్ మెహసేన్, సిరియా దేశానికి చెందిన ఆల్ మొహిమ్మద్ అరాఫత్, షేక్
నాగూర్ షరీఫ్, చెరుకు వెంకట సూర్య కుమార్ రెడ్డి, పాలెం అవినాష్ ను
అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుండి 2.6 కిలో
గంజాయి, వెయ్యి రూపాయ నగదు మరియు రెండు మోటార్ సైకిళ్లను
స్వాధీనం చేసుక్నుట్లు తెలిపారు. ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన డిఎస్పీలు ఎమ్.
కమలాకర రావు, క్ష్మినారాయణ, సిఐు బి.
శ్రీనివాసరావు, ఎ. శివ ప్రసాద్, ఎం.
వెంకటరావు, ఎస్సై విశ్వనాధ రెడ్డి మరియు సిబ్బందిని ఎస్పీ
అభినందించారు.