యూనిట్
Flash News
చేబ్రోలు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సౌత్ కోస్టల్ రేంజ్ ఐజిపి
గుంటూరు
అర్భన్ పరిధిలోని చేబ్రోలు పోలీస్ స్టేషన్‌ను సౌత్ కోస్టల్ రేంజ్ ఐజిపి
వినీత్ బ్రిజ్‌లాల్ అర్భన్ ఎస్పీ పి.హెచ్.డి రామకృష్ణతో కలిసి తనిఖీ చేశారు.
స్టేషన్‌లోని రికార్డుల పరిశీలించి, కేసుల వివరాలను డిఎస్పీ కమలాకర్, సి.ఐ టీవీ
శ్రీనివాసరావులను అడిగి తెల్సుకున్నారు. స్పందన కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదులను
త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తగు
చర్యలు తీసుకోవాలని సూచించారు. వారాంతపు సెలవుల విషయంలో ఏమైన ఇబ్బందులు
ఎదురవుతున్నాయా అని సిబ్బందిని అడిగి తెల్సుకున్నారు. అత్యవసర పరిస్థితులలో తప్ప
అన్ని వేళలా వారాంతపు సెలవులు సిబ్బందికి ఇవ్వాలని తెలిపారు.