యూనిట్

భద్రత మరియు ఆరోగ్య భద్రత యాప్ తో ప్రయోజనాలెన్నో

భద్రత మరియు ఆరోగ్య భద్రత యొక్క పూర్తి సమాచారం సిబ్బంది తెల్సుకోవడానికి భద్రత యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌ వలన సిబ్బందికి చాలా ప్రయోజనాలు వున్నాయి. యాప్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌కి వెళ్లి APBAB అని టైప్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. యూజర్‌ నేమ్‌గా వ్యక్తిగత భద్రత నెంబర్‌ను, పాస్‌ వర్డ్ (Admin.123)ను టైప్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. అందులో ప్రొఫైల్‌, భద్రత, ఆరోగ్య భద్రత, ఫిర్యాదు, అభిప్రాయం, వెల్నెస్‌, తరుచుగా అడిగే ప్రశ్నలు, ఇన్బాక్స్‌ మరియు కాంటాక్ట్‌ అనే ఫీచర్స్‌ వుంటాయి. ఫ్రొఫైల్‌లో సిబ్బంది యొక్క వ్యక్తిగత సమాచారం మరియు వారి కుటుంబ సభ్యుల సమాచారం వుంటుంది. భద్రత ఫీచర్‌లో వ్యక్తిగత చందా వివరాలు, ఇప్పటివరకు వున్న ఫండ్‌ వివరాలు వుంటాయి, లోన్‌ ఎలిజిబిలిటి తనిఖీ చేసుకోవచ్చు, సభ్యుడి వ్యక్తిగత లోన్‌ వివరాలు మరియు ఏ ఏ లోన్‌కి ఉండాల్సిన అర్హతలు, పత్రాల కోసం పేర్కొన్నారు. ఆరోగ్య భద్రత ఫీచర్‌లో అసుపత్రుల వివరాలు, సభ్యుని వ్యక్తిగత చందా వివరాలు, కేసుల వివరాలు తెలిపి వుంటాయి. ఫిర్యాదు ఫీచర్‌లో ఏమైనా భద్రత, ఆరోగ్య భద్రత విషయాలపై ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు. ఆరోగ్య భద్రత వలన వైద్యం పొందిన సభ్యుడు ఆరోగ్యం పొందిన విధానం పై ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చే సౌలభ్యం కలదు. వెల్నెస్‌ ఫీచర్‌లో సిబ్బంది వ్యక్తిగత ఆరోగ్య వివరాలు నమోదు అయి వుంటాయి. ఇన్బాక్స్‌ ఫీచర్‌లో భద్రత, ఆరోగ్య భద్రతలకు సంభందించిన సర్క్యూలర్‌లు మరియు ఏమైన సమాచారం వుంటే సభ్యునికి చేరవేస్తారు. కాంటాక్ట్‌ ఫీచర్‌లో భద్రత మరియు ఆరోగ్య భద్రతల పై ఏమైనా సమాచారం తెల్సుకోవాలన్నా కస్టమర్‌ సపోర్ట్‌ ఫోన్‌ నంబర్‌ 9014290290కి కాల్‌ చేసి తెల్సుకోవచ్చును. ఇన్ని సౌలభ్యాలు గల భద్రత యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుని ఎంతో విలువైన సమాచారన్ని సులభంగా తెల్సుకోవచ్చును.

వార్తావాహిని