యూనిట్

భారీగా గంజాయి స్వాధీనం

విజయనగరం జిల్లా పార్వతీపురం అదనపు ఎస్పీ డా. సుమిత్ గరుడ్ కు వచ్చిన సమాచారం మేరకు పాచిపెంట పోలీస్ స్టేటన్ పరిధిలోని పి. కోనవలస చెక్ పోస్ట్ వద్ద సాలూరు సి ఐ సింహాద్రి నాయుడు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు. పోలీస్ బృందం తనిఖీలలో కంటైనెర్ ను తనిఖీ చేయగా 240  ప్యాకెట్లు కలిగిన 1350 కిలోల గంజాయి లభించింది. కంటైనర్ డ్రైవర్ మరియు క్లీనర్ లను అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిస్సా రాష్ట్రం పొట్టంగి నుండి ఢిల్లీ తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి  గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఉత్తమ పనితీరు కనబర్చిన సాలూరు సి ఐ సింహాద్రి నాయుడు, పాచిపెంట ఎస్సై గంగరాజు మరియు వారి సిబ్బందికి జిల్లా ఎస్పీ అభినందనలు తెలియజేసారు. 

వార్తావాహిని