యూనిట్

అనంతపురంలో దిశ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం

అనువైన ప్రదేశం కోసం జిల్లా ఎస్పీ నగరంలో పర్యటన

అనంతపురం జిల్లా కేంద్రంలో దిశ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించారు. అనువైన ప్రాంతం కోసం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు శుక్రవారం సుడిగాలి పర్యటన చేసి నగరంలోని పలు పోలీసు స్టేషన్లు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన విషయం తెలిసిందే. 2020 సంవత్సరాన్ని ఉమెన్ సేఫ్టీ ఇయర్ గా పరిగణించిది. ఇందులో భాగంగా ... పోలీసు స్టేషన్లను ఆధునీకరించి వివిధ సదుపాయాలు కల్పించాలని శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా రాష్ట్రంలోని మహిళా పోలీసు స్టేషన్లను బలోపేతం చేసి మహిళలు స్నేహపూర్వక వాతావరణంలో తమ సమస్యలు చెప్పుకునేలా కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అనంతపురం నగరంలో దిశ పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం జిల్లా ఎస్పీ కసరత్తు ప్రారంభించారు. అనంతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ఎ.రామచంద్రతో కలసి నగరంలోని పలు స్టేషన్లను సందర్శించి పరిశీలించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుండీ మహిళా పోలీస్ స్టేషన్ ... అక్కడి నుండీ పాత పోలీస్ కంట్రోల్ రూం... ఆ తర్వాత త్రీటౌన్ , సైబర్ సెల్ మరియు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్లను సందర్శించారు. అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సంబంధిత పోలీస్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. మహిళా పోలీసు స్టేషన్ బలోపేతంలో భాగంగా ఒక డీఎస్పీ, నలుగురు ఎస్ ఐ లు మరియు సిబ్బందిని కూడా అదనంగా కేటాయించింది. ఎస్పీ ఆయా పోలీసు స్టేషన్లకు వెళ్లిన సందర్భంలో  ఆయా పోలీసు స్టేషన్ల సిబ్బంది విధులపై ఆరా తీశారు. సంక్షేమ చర్యలులో భాగంగా వారాంతపు సెలవు అమలుపై అడిగి తెలుసుకున్నారు. ఆయా సి.ఐ లతో కూడా మాట్లాడారు.పోలీసు స్టేషన్లలోని రిసెప్షన్ కేంద్రాలను, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

వార్తావాహిని