యూనిట్

కృష్ణా జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సంక్రాంతి రంగవల్లి పోటీలు

 సంక్రాంతి పండుగ పురస్కరించుకొని యువత ఎటువంటి జూదాలకు, చెడు వ్యసనాలకు పాల్పడరాదన్న ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ రవింద్రనాథ్ అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడా పోటీలను నిర్వహింపజేస్తున్నారు. అదే విధంగా మచిలీపట్నంలోని జిల్లా  పోలీస్ గ్రౌండ్ లో మహిళలకు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన ఈ పోటీలలో మహిళలు, విద్యార్థినులు, యువతులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సతీమణి శ్రీమతి హేమ మణి, ఏ ఎస్పీ సతీమణి శ్రీమతి రమాదేవి, డి ఈ ఓ రాజ్యలక్ష్మి హాజరై న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి, విజేతలకు బహుమతులు అందించారు.అదే విధంగా ట్రైనీ ఐపీఎస్ కృష్ణకాంత్ పటేల్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ధర్మేంద్ర, ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ కూడా న్యాయ నిర్ణేతలుగా సహాయపడ్డారు.

ఈ సందర్భంగా కానిస్టేబుల్ శ్రీనివాసరావు కుమార్తె పూర్ణ చంద్రిక ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం అందరిని అలరించింది.  ఈ పోటీల విజేతలు మొదటి బహుమతి మల్లేశ్వరి కి 5 వేలు, రెండో బహుమతి స్వప్నకు 2 వేలు, మూడవ బహుమతి శ్రీ లక్ష్మికి వెయ్యి రూపాయలు అందజేయడమే కాకుండా 12 మందికి కన్సోలేషన్ మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికి  ప్రోత్సాహ బహుమతులు అందజేశారు. ఇదే గ్రౌండ్ లో ట్రైనీ ఐపీఎస్ కృష్ణ కాంత్ ప్రారంభించిన పురుషుల వాలీబాల్ పోటీలలో వైఎస్సార్ కాలనీకి చెందిన యువకుల జట్టు విజేతగా నిలిచింది.

వార్తావాహిని