యూనిట్
Flash News
ఇసుక అక్రమ రవాణాను అరికడతాం - తిరుపతి అర్బన్ ఎస్పీ
వడమాలపేట పోలిస్ స్టేషన్ పరిధిలో గల ఇసుక అక్రమ
రవాణా చెక్ పోస్టును తిరుపతి జిల్లా యస్.పి డా.గజరావు భూపాల్ ఆకస్మిక తనిఖి చేసి
అక్కడ పని చేయు సిబ్బందికి పలు సూచనలను చేసినారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి అర్బన్ జిల్లాలో
ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పూర్తిగా రూపుమాపాలనే ఉద్దేశ్యంతో
వడమాలపేట పోలిస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టును ఏర్పాటు చేసామని, దీని వలన ఇసుక అక్రమ రవాణా చాలా వరకు తగ్గి మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
అంతేకాకుండా నూతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన CC కెమెరాలను ఏర్పాటు చేయడంతో
పాటు బాడీ వొర్న్ కెమెరాను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ
కెమెరాలు నిరంతరము పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు. ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక
అక్రమ రవాణా పాల్పడితే కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని,
అంతే కాకుండా ఇతర చట్ట వ్యతిరేక అక్రమ రవాణాకూ పాల్పడే వారిపై కూడా
నిఘా ఉంచి కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ చెక్
పోస్టు నందు నలుగురు పోలీస్ సిబ్బందితో పాటు, నలుగురు స్పెషల్
పోలీస్ ఆఫీసర్స్ నిత్యము విధులలో పై అధికారుల పర్యవేక్షణలో ఉంటారని తెలిపారు.
ఈ సందర్భంగా రేణిగుంట DSP చంద్రశేఖర్, రేణిగుంట
రూరల్ CI అమరనాథ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.