యూనిట్
Flash News
విజయవాడలో 'రన్ ఫర్ యూనిటీ'

దేశ సమైక్యత, సమగ్రతను చాటి చెప్పిన స్వాతంత్య్ర సమర యోధుడు మరియు భారత దేశ తొలి?ఉప ప్రధాని,హోం శాఖామాత్యులు శ్రీ సర్థార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని 31.10.2019న రాష్ట్రీయ ఏక్‌తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్బంగా విజయవాడలో ''రన్ ఫర్ యూనిటీ'' కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర డిజిపి?శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారు విచ్చేయగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఎం.డి. ఇంతియాజ్ ఖాన్, విజయవాడ పోలీస్ కమీషనర్ సి.హెచ్.ద్వారకా తిరుమలరావు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని దేశ సమైక్యత మరియు సమగ్రత కోసం కట్టుబడి వుంటామని ప్రతిజ్ఞ చేసి, పావురాలను గాలిలోకి ఎగురవేశారు. అనంతరం డిజిపి శ్రీ గౌతం సవాంగ్ గారు ''రన్ ఫర్ యూనిటీ''ని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించగా పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువత, వివిధ మతాలకు సంబంధించిన పెద్దలు మరియు నగర ప్రజలు భారీ సంఖ్యలో పాలుపంచుకున్నారు. ఈ రన్ ఫర్ యూనిటీ బెంచ్ సర్కిల్ వద్ద నుండి ప్రారంభమై బందర్ రోడ్డు మీదుగా సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ గ్రౌండ్ వరకు కొనసాగింది.