యూనిట్
Flash News
నేరస్థుల పై రౌడీ షీట్స్ ఓపెన్ చేయండి: విజయనగరం ఎస్పీ
ఎన్.డి.పి. ఎస్, పోక్సో, రేప్ మరియు వైట్ కాలర్ నేరాల్లో ముద్దాయిల పై రౌడీ షీట్లను ఓపెన్ చేయాలనీ
విజయనగరం జిల్లా ఎస్పీ శ్రీమతి బి రాజ కుమారి పోలీస్ అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన నెల వారి నేర సమీక్షా
సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భముగా ఆమె మాట్లాడుతూ పెండింగ్ కేసుల
ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఛార్జ్ షీట్లను త్వరితగతిన వేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఓ ఎస్ డి జె. రామ్మోహన రావు, పార్వతీపురం ఏ
ఎస్పీ డా. సుమిత, బొబ్బిలి ఏ ఎస్పీ మిస్ గౌతమి, డిఎస్పీలు పి. వీరాంజనేయ రెడ్డి, సి. ఎం. నాయుడు,
బి. మోహన రావు, జె. పాపా రావు, ఎల్. మోహన రావు, ఎల్. శేషాద్రి, పరశురామ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.