యూనిట్

పలు దోపిడీ, దొంగతనాలకు పాల్పడిన ముఠా పట్టివేత

అనంతపురం జిల్లాలో పలు దోపిడీ, దొంగతనాలకు పాల్పడిన ముఠాను అనంతపురం సబ్‌ డివిజన్‌ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాకు చెందిన నలుగుర్ని అరెస్టు చేసి వీరి నుండి రూ.4.15 లక్షల నగదు, 47 గ్రాముల బంగారు నగలు, మూడు ద్విచక్ర వాహనాలు, రెండు గ్యాస్‌ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి వాటిని తీర్చుకునేందుకు దొంగల అవతారమెత్తి నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడయ్యింది. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు   వివరాలను వెల్లడించారు. లక్కిరెడ్డి గారి లక్కిరెడ్డి, పెనకలపాటి ప్రకాష్‌ నాయుడు, పొలిశెట్టి సంజయ్‌, పల్లె దివాకర్‌లను అరెస్టుచేసినట్లు ఎస్‌.పి. తెలిపారు. నేరాలపై ప్రత్యేక నిఘా వేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం డీిఎస్పీ పర్యవేక్షణలో సి.ఐ.లు జాకీర్‌ హుస్సేన్‌ ఖాన్‌, మురళీధర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, విజయభాస్కర్‌గౌడ్‌లు. ఎస్‌.ఐ.లు జి.జయపాల్‌రెడ్డి, బి.రాఘవరెడ్డి, జి.ప్రసాద్‌లు, సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా పెట్టారు. పక్కా రాబడిన సమాచారంతో ఈ నలుగురు నిందితులను ప్రసన్నాయపల్లి రైల్వే గేటు వద్ద   పోలీసు బృందం అరెస్టు చేసింది.

వార్తావాహిని