యూనిట్

ప్రమాదాల నివారణకు రహదారి భద్రత నియమాలను పాటించాలి: కర్నూలు ఎస్పీ

ప్రమాదాల నివారణకు రహదారి భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ భాద్యతగా పాటించినప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని కర్నూల్ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి  అన్నారు. బుధవారం  31 వ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని ఏపీఎస్ఆర్ టి సి  జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ లో డ్రైవర్ లకు శిక్షణ కార్యక్రమము   ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా   ఎస్పీ హాజరై మాట్లాడారు.  ప్రమాద రహిత సమాజం కోసం అందరూ పాటుపడాలన్నారు. డ్రైవింగ్ చేసే సమయంలో మనసు ఏకాగ్రత గా ఉంచుకోవాలన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలన్నారు. ప్రమాదాల పట్ల ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలన్నారు. ఒక డ్రైవర్ చేతిలోనే కొన్ని కుటుంబాల జీవితాలు ఉంటాయాన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహానాలు నడపడం, ఓవర్ టేకింగ్ చేయడం వంటి వాటి నిర్లక్ష్యపు చర్యల వలనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.  అనంతరం  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కడప జోన్  కె. ఆదామ్ సాహెబ్  మాట్లాడుతూ ప్రమాదాలు నివారించుటకు తీసుకోవలసిన జాగ్రత్తలు , సలహాలు సూచనలు శిక్షణ డ్రైవర్లు  ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్   టి. వి రామమ్ , జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీ ప్రినిసిపాల్   కె రవి  హాజరైనారు

వార్తావాహిని