యూనిట్
Flash News
రహదారి ప్రమాదాలను మరింతగా నియంత్రించాలి

రాష్ట్ర డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్ గారు మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో రహదారి భద్రత అంశంపై సమావేశం నిర్వహించారు. సమావేశం లో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా శాఖలు మరింత సమన్వయంతో కషి చేయాలనీ, ప్రమాదాలు జరిగినపుడు తక్షణమే క్షతగాత్రులకు వైద్య సహాయం అందే విధంగా చర్యలు ఉండాలని సూచించారు. ఇందుకోసం 108 మరియు ఇతర అంబులెన్స్‌లను పోలీస్, రవాణాశాఖలతో అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. అదే విధంగా ప్రస్తుతం జాతీయ రహదారులపై గస్తీ తిరుగుతున్న వాహనాలకు అదనంగా మరో 35 వాహనాలను సమకూర్చాల్సి ఉందన్నారు. టోల్ ప్లాజ, జాతీయ రహదారులు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రైవేట్ సీసీి కెమెరాలను జిల్లా కేంద్రాలలోని కమాండ్ సెంటర్స్, ప్రధాన కార్యాలయంలోని కమాండ్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని టెక్నికల్ డిఐజి పాలరాజును ఆదేశించారు. ఈ ప్రక్రియను మూడు నెలలలోగా పూర్తి చేసేలా కార్యక్రమాన్ని నిర్దేశించుకోవాలన్నారు. ఈ విధంగా చేయడం వలన ప్రమాదాలు జరగడానికి కల కారణాలను సహేతుకంగా విశ్లేషించుకొని, తగిన నివారణ చర్యలు తీసుకోగలుగుతామన్నారు. సమావేశంలో పాల్గొన్న నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సేఫ్టీ అడ్వైజర్ హరికష్ణ తమ పరిధిలోని అన్ని సీసీ కెమెరాలను ప్రధాన కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానించడానికి అంగీకారం తెలిపారు.