యూనిట్

రహదారి భద్రతకు కృషి చేసిన పోలీసులకు పురస్కారాలు

                         

31 జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో ట్రాఫిక్ విధి నిర్వహణ లో ప్రజలకు అత్యంత సేవలను చేసిన పోలీసులను   జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రావు  ఘనంగా సత్కరించారు.  హెడ్ కానిస్టేబుల్ 1519 జి. జ్యోతి బాబు( నల్లజర్ల పోలీస్ స్టేషన్),హెడ్ కానిస్టేబుల్ 1907 ఏం రంగారావు( తాడేపల్లిగూడెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్) అను వారు   హైవే పెట్రోలింగ్ వాహనం లో ఉద్యోగ నిర్వహణ చేస్తూ హైవేల నందు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రుల్లో జాయిన్ చేసి ప్రాణాలు కాపాడినందుకు మరియు కానిస్టేబుల్ 1527 ఎస్ వి వి ఎస్ కృష్ణారావు (భీమవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్)  భీమవరం పట్టణం నందు ట్రాఫిక్ నియంత్రణకు  నిబద్ధతతో పని చేసినందుకు గాను కలెక్టర్  ప్రశంసా పత్రములు మరియు  31 వ జాతీయ రోడ్డు భద్రత జ్ఞాపికలను ఇచ్చి పోలీసు అధికారులను దుశ్శాలువతో కలెక్టర్ ఆఫీస్ నందు సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి, ఆర్టిఓ , ఏలూరు డి ఎస్ పి  కిరణ్ , ఎస్ బి  డి ఎస్ పి కే రజిని కుమార్, పశ్చిమగోదావరి జిల్లా డి ఎం హెచ్ వో , ఆర్ అండ్ బి , పంచాయతీరాజ్,   అభ్కరీ శాఖ ,నేషనల్ హైవే అథారిటీ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ హాజరయ్యారు.

వార్తావాహిని