యూనిట్

గుంటూరు అర్భన్‌లో పదవీ విరమణ కార్యక్రమం

గుంటూరు అర్భన్‌లో పదవీ విరమణ కార్యక్రమం గుంటూరు అర్భన్‌ నూతన సమావేశ మందిరంలో ఎస్పీ పి హెచ్‌ డి రామకృష్ణ ఆధ్వర్యంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. పదవీ విరమణ చేసిన వారిలో సిసిఎస్‌ అడిషనల్‌ ఎస్పీ ఎం వెంకటేశ్వర్లు, ఈస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ ఎస్‌ ఎమ్‌ నాజీమ్‌ ఉద్దీన్‌, ఏఆర్‌ ఆర్‌ఎస్‌ఐ కె ఆనందరావు, లాలాపేట స్టేషన్‌ ఏఎస్‌ఐ ఏ నాగేశ్వరరావు, నల్లపాడు స్టేషన్‌ హెచ్‌ సి జి మల్లిఖార్జునరావులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ శాఖలో సుదీర్ఘ కాలం అంకిత భావంతో విధులు నిర్వర్తించి అటు ప్రజలలోను, ఇటు అధికారులు, తోటి సిబ్బంది మన్ననలను అందుకున్నారని, వీరి విరామ జీవితం ఆరోగ్య ఆనందాలమయంగా సాగాలని ఆకాంక్షించారు. వారికి పోలీస్‌ కుటుంబం ఎల్లప్పుడూ అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వైటి నాయుడు, ఆర్‌ఐలు విజయసారధి, భగవాన్‌, సిఐలు ఎస్వీ రాజశేఖర్‌ రెడ్డి, సురేష్‌బాబు, షేక్‌ ధెరిసా ఫిరోజ్‌, ఎస్‌ఐలు బ్రహ్మానందం, సమీర్‌ బాషా పోలీసు అధికారుల సంఘం సభ్యులు హుస్సేన్‌ బేబీ రాణి కరీముల్లా లక్ష్మయ్య, జానయ్య ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దళవాయి సుబ్రహ్మణ్యం ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని