యూనిట్
Flash News
పదవీ విరమణ సత్కారం
పదవీ విరమణ సత్కారం 16వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ (హెచ్.సి.232) పి.కష్ణా రావు ఇటీవల పదవీ విరమణ చెందారు. ఈ సందర్భంగా కమాండెంట్ వి.జగదీష్ కుమార్ ఆధ్వర్యంలో కృష్ణారావు దంపతులను పూలమాలలు, శాలు వలతో సత్కరించారు. కృష్ణారావు పోలీసుశాఖకు సుదీర్ఘకాలంగా చేసిన సేవలను కమాండెంట్, ఇతర అధికారులు కొనియాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ జి. అమత రావు, ఆర్.ఐ.లు కె.తులసి రావు, కె.సమర్పణ రావు, కె. శ్రీనివాసరావు, జె.సిహెచ్. కేశవ రావు, ఆర్.ఐ.లు, ఏఆర్‌ఎస్.ఐ.లు తదితర సిబ్బంది పాల్గొన్నారు.