యూనిట్

పదవీ విరమణ సత్కారం

పదవీ విరమణ సత్కారం 14వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌.ఎస్‌.ఐ. బి.పి.వెంకటస్వామి, ఏఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌.శంకరప్పలు ఇటీవల పదవీ విరమణ చెందారు. వీరికి డిఐజి, ఇన్‌చార్జి కమాండెంట్‌ సి.హెచ్‌.వెంకటేశ్వర్లు పదవీ విరమణ చెందిన సిబ్బందిని పూలమాలలు, శాలువలతో సత్కరించారు. అనంతరం డిఐజి మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పోలీసుశాఖకు ఎనలేని సేవలు చేసిన మీకు పోలీసుశాఖ ఎల్లప్పుడు తోడు ఉంటుందన్నారు. శేషజీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కమాండెంట్‌ ఎస్‌.నాగరాజు, అసిస్టెంట్‌ కమాండెంట్‌ డి.వి.రమణ మూర్తి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని