యూనిట్

పదవీ విరమణ సత్కారం

పదవీ విరమణ సత్కారం సిఐడి పోలీస్‌శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఇరువురు సిబ్బంది ఇటీవల పదవీ విరమణ చెందారు. వారిలో ఎస్‌.ఐ. ఎ.నరసింహరాజు, హెడ్‌కానిస్టేబుల్‌ ఎ.ఎస్‌. నాగరాజులు ఉన్నారు. వీరికి అదనపు డిజిపి, సిఐడి చీఫ్‌ అమిత్‌గార్గ్‌ పూలమాలలు, శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా అదనపు డిజిపి మాట్లాడుతూ సుదీర్ఘకాలం విధినిర్వహణలో ప్రశంసాత్మకమైన విధులు నిర్వర్తించి, ఇరువురూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. మున్ముందు శేషజీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిఐజి ప్రభాకర్‌రావు, ఎస్‌.పి.లు జి.వి.జి. అశోక్‌కుమార్‌, శ్రీమతి రత్నం, అదనపు ఎస్‌.పి.లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వార్తావాహిని