యూనిట్
Flash News
పదవి విరమణ సత్కారం

పోలీసుశాఖకు సుమారు మూడున్నర దశాబ్దాల విశిష్ట సేవలందించి పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల, సిబ్బందిని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఘనంగా సన్మానించి సత్కరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పని చేసిన ఎస్ ఐ లు నూర్ మహమ్మద్ , రాంగోపాల్ , రామచంద్రారెడ్డి, ఏఎస్సై హరినాథ్ , హెడ్ కానిస్టెబుల్ తిమ్మప్ఫ, బ్రహ్మయ్య, కానిస్టేబుల్ రవి, ఏ.ఆర్ కానిస్టేబుల్ నాగేశ్వరలు ఇటీవలే పదవీ విరమణ పొందారు. వీరిలో ఆరుగురికి శుక్రవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో సన్మానం చేసి సత్కరించారు. ఈకార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏ ఉద్యోగి అయినా పదవీ విరమణ పొందడం సహజమన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలులోకెల్లా పోలీసుశాఖ కీలకమైందన్నారు.
ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండి వారి సాధకబాధకాల్లో మమేకమై సేవలందించే అవకాశం పోలీసుశాఖలోనే అధికంగా ఉంటుందన్నారు. సుమారు మూడున్నర నుండీ నాలుగు దశాబ్దాలు సమాజం కోసం అహర్నిశలు కష్టించి పదవీ విరమణ పొందుతున్న సిబ్బంది జీవితాలు సార్థకమన్నారు. ఎన్నో అనుభవాలు ఎదురయ్యి ఉంటాయన్నారు. పదవీ విరమణ పొందాక కూడా వీరి అనుభవాలు వినియోగించుకుంటామన్నారు. ఉద్యోగం లేని పోలీసులుగా మరియు అనుభవజ్ఞులుగా ఈతరం పోలీసుల్లో స్ఫూర్తినింపాలన్నారు. విశ్రాంత సమయంలో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందాక అందాల్సిన ప్రయోజనాలైన జి.పి.ఎఫ్ , ఏ.పి.జి.ఎల్ .ఐ , భద్రతల కింద వచ్చిన సొమ్మును వృథా చేసుకోకుండా ప్రణాళికాబద్ధంగా భవిష్యత్తుకు వినియోగించుకోవాలని సూచించారు.
అనంతరం పదవీ విరమణ పొందిన అధికారుల దంపతులకు ఎస్పీ చేతుల మీదుగా పూలమాలలు వేసి సన్మానం చేశారు. శాలువా కప్పి సత్కరించారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ జి.రామాంజినేయులు, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ రామచంద్ర, ఆర్ ఐ వెంకటేశ్వర్లు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్ , సుధాకర్ రెడ్డి, శ్రీనివాసులనాయుడు, తేజ్ పాల్ , జిల్లా పోలీసు కార్యాలయం ఏ.ఒ శంకర్ , సిబ్బంది శ్రీనివాసులు, పదవీ విరమణ పొందిన అధికారుల బంధువులు, సన్నిహితులు, తదితరులు పాల్గొన్నారు.