యూనిట్
Flash News
పదవీ విరమణ సత్కారం
పదవీ విరమణ సత్కారం అనంతపురం జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది ఇటీవల పదవీ విరమణ చెందారు. వీరికి జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పదవీ విరమణ చెందిన వారిలో సి.ఐ తిరువాయిపాటి ఆంజనేయులు, ఎస్.ఐ.లు గోవిందరాజులు, వెంకటరాముడు, అబ్దుల్ రహమాన్, పద్మనాభం, ఎ.ఎస్.ఐ వీరన్నలు ఉన్నారు. ఏ ఉద్యోగి అయినా పదవీ విరమణ పొందడం సహజమన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలులోకెల్లా పోలీసుశాఖ కీలకమైందన్నారు. ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండి వారి సాధకబాధకాల్లో మమేకమై సేవలందించే అవకాశం పోలీసుశాఖలోనే అధికంగా ఉంటుందన్నారు. అనంతరం పదవీ విరమణ పొందిన అధికారుల దంపతులకు ఎస్పీ చేతుల మీదుగా పూలమాలలు వేసి సన్మానం చేశారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి కె.చౌడేశ్వరి, డీఎస్పీలు రామచంద్ర, ఎన్.మురళీధర్, పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్ నాథ్, జాఫర్, సుధాకర్ రెడ్డి, శివారెడ్డి, సరోజ, ఎస్పీ కార్యాలయ సిబ్బంది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.