యూనిట్

పదవీ విరమణ సత్కారం

పదవీ విరమణ సత్కారం గుంటూరు రూరల్‌ జిల్లా పోలీసుశాఖలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న కే.శ్రీనివాసరావు ఇటీవల పదవీ విరమణ చెందారు. ఆయన తెనాలి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ సందర్భంగా ఎస్‌.పి. శ్రీమతి ఆర్‌.జయలక్ష్మి వారిని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమములో పదవీ విరమణ చేయుచున్న శ్రీనివాస రావుకు అందవలసిన రెటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను అందజేశారు. ఈ సందర్భముగా ఎస్పీ మాట్లాడుతూ మీకు ఎల్లప్పుడు మా యొక్క సహాయ సహకారాలు అందచేస్తామని పదవీ విరమణ చేయుచున్న మీ యొక్క శేష జీవితము సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డ్సు ఆర్‌.ఐ. కష్ణ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని