యూనిట్
Flash News
పదవీ విరమణ సత్కారం

పదవీ
విరమణ సత్కారం పశ్చిమగోదావరి జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న 10మంది సిబ్బంది పదవీ విరమణ చెందారు. ముగ్గురు
ఎస్.ఐ.లు డీజే రత్నం, ఏ.నరసింహరాజు, ఏ.
అప్పారావు, నలుగురు ఏఎస్‌ఐలు ఎస్‌కే.నాగూర్ సాహెబ్,
పి.కుమార్ స్వామి, వైఆర్‌డి సింగ్ బాబు,
పి.త్రినాదరావు, ముగ్గురు కమ్యూనికేషన్
సిబ్బంది ఇన్‌స్పెక్టర్, సి.హెచ్ ఆనందరావు, ఎస్.ఐ, బి.వెంకట సుబ్బరావు, ఏఎస్‌ఐ,
పి.చిట్టి బాబులు పదవీ విరమణ చెందారు. వీరికి ఎస్.పి. నవదీప్
సింగ్ గ్రేవాల్ పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్.పి. మాట్లాడుతూ
పోలీసుశాఖకు ఎనలేని సేవలు చేసిన మిమ్ములను గుర్తుంచుకుంటామన్నారు. కార్యక్రమంలో
అదనపు ఎస్‌పి మహేష్ కుమార్, డిఎస్‌పి కె.శ్రీనివాసాచారి,
సిఐ కష్ణారావు, సిబ్బంది తదితరులు హాజరయ్యారు.