యూనిట్

పదవీ విరమణ సత్కారం

కర్నూలు జిల్లా పోలీసుశాఖలో హోంగార్డులుగా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది పదవీ విరమణ చెందారు. వీరికి జిల్లా ఎస్‌.పి. డాక్టర్‌ ఫక్కీరప్ప పూలమాలలు, శాలువలతో సన్మానించారు. పదవీ విరమణ చెందిన వారిలో జె.మహేశ్వరయ్య, బి.సంజన్న, ఎమ్‌.ఎన్‌.చౌడేశ్వర్లు, డి. దానమ్మలు ఉన్నారు. వారి సేవలను ఎస్‌.పి. కొనియాడారు. కార్యక్రమంలో హోంగార్డు డీఎస్పీ హనుమంతు, హోంగార్డ్సు ఇన్‌చార్జి ఆర్‌.ఐ. శివారెడ్డి, హోంగార్డ్సు యూనిట్‌ ఇన్‌చార్జిలు వెంకటనాయక్‌, గోవింధరాజులు, కాంత రెడ్డి, హోంగార్డు సంఘం అధ్యక్షులు విజయరత్నం, సభ్యులు శ్రీమతి నాగమణి పాల్గొన్నారు.

వార్తావాహిని