యూనిట్

పదవీ విరమణ సత్కారం

14వ పటాలంలో ఆర్‌.ఐ.గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌.కె.మహబూబ్‌ బాషా ఇటీవల పదవీ విరమణ చెందారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కమాండెంట్‌ ఎస్‌.నాగరాజు పూలమాలలు, శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కమాండెంట్‌ మాట్లాడుతూ ఎస్‌.కె. మహబూబ్‌బాషా పటాలంలో సుదీర్ఘకాలంగా ప్రశంసాత్మకమైన సేవలు అందించారని, అంతేగాక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చినట్లు, ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డిఎస్‌పి టి.సర్కార్‌, అసిస్టెంట్‌ కమాండెంట్‌ రాంబాబు తదితర ఉన్నతాధికారులు పాల్గొని ఎస్‌.కె.మహబూబ్‌బాషాకు వీడ్కోలు పలికారు.

వార్తావాహిని