యూనిట్

పదవీ విరమణ సత్కారం

9వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌.ఎస్‌. ఐ.లు జి.వెంకటేశ్వర్లు, కె.వి.రమణ, హెడ్‌కానిస్టేబుల్‌ ఇ.గణపతిలు ఇటీవల పదవీవిరమణ చెందారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కమాండెంట్‌ పి.మోహన్‌ ప్రసాద్‌ శాలువలు, పూలమాలలతో పదవీ విరమణ చెందిన సిబ్బందిని, కుటుంబ సభ్యులతోపాటు సన్మానించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కమాండెంట్‌ మాట్లాడుతూ సుదీర్ఘకాలంలో పోలీసుశాఖలో ఎనలేని సేవలు అందించిన మీ సేవలను ఎన్నటికీ మరువమన్నారు. అలాగే పదవీ విరమణ అనంతరం రావాల్సిన రాయితీలను వెంటనే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. శేషజీవితం ఆయురారోగ్యాలతో సాగాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొని వారికి వీడ్కోలు పలికారు.

వార్తావాహిని