యూనిట్
Flash News
పదవీ విరమణ సత్కారం
6వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సిబ్బంది ఇటీవల పదవీ విరమణ
చెందారు. వీరిలో ఆర్.ఎస్.ఐ. ఎం నరసింహాచారి, ఏఆర్‌ఎస్‌ఐలు
సత్యనారాయణ, జి. ప్రభుదాసు, హెడ్‌కానిస్టేబుల్
చందు సింగ్‌లు పదవీ విరమణ చెందారు. ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ సాయి ప్రసాద్
వారిని పూలమాలలు, శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్
కమాం డెంట్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పోలీసుశాఖకు మీరు చేసిన సేవలను ఎన్నటికీ
మరువమన్నారు. మున్ముందు ఏవైనా సమస్యలు వస్తే తమను సంప్రదించాలని సూచించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్‌లు శ్రీనివాసబాబ్జి, హనుమంతు,
పటాలము ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని
పదవీ విరమణ చెందిన సిబ్బందిని సన్మానించి, వారి సేవలను
కొనియాడారు.