యూనిట్

పదవీ విరమణ సత్కారం

2వ పటాలంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది ఇటీవల పదవీ విరమణ చెందారు. వీరికి కమాండెంట్‌ ఎస్‌.కె. హుసేన్‌ సాహెబ్‌ శాలువలు, పూలమాలలతో సత్కరించారు. పదవీ విరమణ చెందిన వారిలో ఆర్‌.ఐ.లు లింగనాయక్‌, ఎబ్బెజి, ఆర్‌.ఎస్‌.ఐ. ఎం.రామన్న, ఏఆర్‌ఎస్‌ఐలు కృష్ణుడు, వెంకటరెడ్డి, చిన్నిక్రిష్ణ, హెచ్‌సి వీరన్నలు ఉన్నారు. శేషజీవితం ఆరోగ్యంగా, ఆనందమయంగా సాగాలని కమాండెంట్‌ ఆకాంక్షించారు. కార్యక్రమంలో పటాలము ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని