యూనిట్

పదవీ విరమణ సత్కారం

అనంతపురం జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న 19మంది సిబ్బంది ఇటీవల పదవీ విరమణ చెందారు. వీరికి ఎస్‌.పి. బి.సత్యయేసు బాబు శాలువలు, పూల మాలలతో సత్కరించారు. అనంతరం శేషజీవితం ఆనందమయంగా సాగాలని ఆకాంక్షించారు. వీరిలో ముగ్గురు ఎస్‌.ఐ.లు, ఇద్దరు ఆర్‌.పి.ఎస్‌.ఐ.లు, ఇద్దరు ఆర్‌.ఎస్‌ఐలు, ముగ్గురు ఎ.ఎస్‌.ఐ.లు, ఇద్దరు ఎ.ఆర్‌.ఎస్‌.ఐ.లు, ఇద్దరు హెడ్‌ కాని స్టేబుళ్లు, ఇద్దరు ఏ.ఆర్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్‌, ఒక సీనియర్‌ అసిస్టెంటు ఉన్నారు. ఎస్పీ మాట్లాడుతూ... సమాజం కోసం వీరంతా సుమారు నాలుగు దశాబ్దాలు పాటు సేవలందించి జీవితాలను పునీతం చేసుకున్నారన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యోగ బాధ్యతలను విజయవంతంగా ముగిం చడం ముదావహమన్నారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీమతి కె చౌడేశ్వరి, ఎం.వి.ఎస్‌ స్వామి, డీఎస్పీ ఎస్‌ మహబూబ్‌ బాషా, పోలీసు అధికారుల సంఘం అడహక్‌ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌ నాథ్‌, జాఫర్‌, సుధాకర్‌ రెడ్డి, గాండ్ల హరినాథ్‌, శివప్రసాద్‌, శ్రీనివాసుల నాయుడు, శ్రీనివాసరెడ్డి, తేజ్‌ పాల్‌, శివ, జి.టి సరోజ, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, పదవీ విరమణ పొందిన పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని