యూనిట్

పదవీ విరమణ సత్కారం

చిత్తూరు జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న 11మంది పోలీసు సిబ్బంది ఇటీవల పదవీ విరమణ చెందారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చింతం వెంకట అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్‌.పి. మాట్లాడుతూ 35 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల పాటు అంకిత భావంతో పోలీసుశాఖకు అందించిన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ఎస్పీ చింతం వెంకట అప్పల నాయుడు పేర్కొన్నారు. పదవీ విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులు, నలుగురు హోంగార్డ్‌లను ఎస్పీ గారు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు, విలువైన బహుమానాలను అందచేశారు. కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో విధులు నిర్వర్తించినందుకు పోలీసు శాఖ తరపున కతజ్ఞతలు తెలిపారు. అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీమతి ఇ. సుప్రజ మాట్లాడుతూ పదవీ విరమణ తర్వాత కూడా మీరు పోలీసు కుటుంబంలో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఎన్‌. చంద్రమౌళి, డీఎస్పీలు ఎన్‌.సుబ్బారావు, కృష్ణమోహన్‌, డీఎస్పీ డి.టి.సి. పాల్గొన్నారు.పదవీ పొందిన వారు ఆర్‌.ఎస్‌.ఐ. వెంకటస్వామి, ఎస్‌.ఐ.లు ఎం.వి.రమణరాజు, కె.వెంకటరమణ, ఎం.సురేష్‌బాబు, ఏఎస్‌ఐలు సి.వి.హైమావతి, కె.వెంకటేష్‌, ఎ.రసూల్‌ సాహెబ్‌, హోంగార్డులు వి.ఎస్‌.రఘునాథ్‌, క్రిష్ణయ్య, టి. వెంకటరమణ, ఎన్‌.ఎస్‌. భాషాలు ఉన్నారు.

వార్తావాహిని