యూనిట్
Flash News
పదవీ విరమణ సత్కారం
5వ పటాలంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్‌ఎస్‌ఐలు ఐదుగురు పదవీ విరమణ చెందగా, ఒక హెడ్‌కానిస్టేబుల్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా కమాండెంట్ జంగారెడ్డి కోటేశ్వరరావు శాలువలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పోలీసుశాఖకు ఎనలేని సేవలు చేసిన మిమ్ములను పోలీసుశాఖ ఎన్నటికి మరువదన్నారు. పదవీ విరమణ అనంతరం శేషజీవితం ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అడిషనల్, అసిస్టెంట్ కమాండెంట్లతోపాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు.