యూనిట్

పదవీ విరమణ సత్కారం

3వ పటాలములో విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు సిబ్బంది ఇటీవల పదవీ విరమణ చెందారు. వారిలో ఏవో ఎస్‌.మండల్‌, ఏఆర్‌ఎస్‌ఐలు కె.యేసుదాసు, జి.అప్పల కొండలు ఉన్నారు. వీరికి కమాండెంట్‌ బి.శ్రీరామమూర్తి శాలువలు, పూలమాలలతో సత్కరించారు. అనంతరం కమాండెంట్‌ మాట్లాడుతూ ఎంతో కాలంగా పోలీసుశాఖలో విధులు నిర్వర్తించిన మీ సేవలను ఎన్నటికీ గుర్తుంచుకుంటామని, అలాగే శేషజీవితం ఆయురారోగ్యాలతో సాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎం.బి.వి.వి. సత్యనారాయణ, ఎస్‌.దేవానందరావు, ఆర్‌.ఐ.లు బి.రామకృష్ణ, బి.ఎస్‌.సి. శేఖర్‌రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తావాహిని