యూనిట్
Flash News
పదవీ విరమణ సత్కారం
కడప జిల్లా పోలీసుశాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్.ఐ.లు జీవీ నారాయణయాదవ్, ఎస్.చెన్నయ్య, ఏఎస్‌ఐ ఎస్‌ఎస్‌గంగయ్య, హెచ్‌సి బీవీ రామయ్య, డీపీవో నాల్గవ తరగతి ఉద్యోగిని శ్రీమతి కె.రామలక్ష్మమ్మలు ఇటీవల పదవీ విరమణ చెందారు. వీరికి ఎస్.పి. అభిషేక్ మహంతి పూలమాలలు, శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్.పి. మాట్లాడుతూ 40 ఏళ్లపాటు అంకితాభావంతో పోలీసుశాఖకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. నిబద్ధతతో విధులు నిర్వర్తించినందుకుగాను పోలీసుశాఖ తరపున ఎస్.పి. కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్.పి.లు ఎ.శ్రీనివాసరెడ్డి, రిషికేశవరెడ్డి, డిఎస్‌పిలు రమణయ్య, నగరాజు, ఆర్.ఐ.లు, పోలీసుఅధికారుల సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.