యూనిట్

నేర రహిత సమాజ నిర్మాణంలో గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులే కీలకం

గ్రామాల్లో, వార్డుల్లో మహిళలు, చిన్నారులు భద్రత కోసం మహిళా రక్షక కార్యదర్శులంతా బాధ్యతగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ  శ్రీమతి బి.రాజకుమారి సూచించారు. శనివారం నెల్లిమర్ల మండలం సారిపల్లి పారిశ్రామికవాడలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో మహిళా రక్షక కార్యదర్శులకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమంలో ఎస్పీ శ్రీమతి రాజకుమారి పాల్గొని మాట్లాడుతూ నేర రహిత సమాజ నిర్మాణంలో గ్రామ, వార్డు మహిళా కార్యదర్శులే కీలకమన్నారు. పోలీసులకు అదనపు బలంగా కావాలన్నారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులను నివారించాలన్నారు.  ఈ కార్యక్రమంలో ఓఎస్‌డీ జె.రామమోన్‌రావు  , డీఎస్పీలు పి.వీరాంజనేయరెడ్డి, ఎల్‌.శేషాద్రి, సీఐలు రాజశేఖరరావు, ఎర్రంనాయుడు, డి.శ్రీహరిరాజు, మంగవేణి, ఎస్‌ఐ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

వార్తావాహిని