యూనిట్
Flash News
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'స్పందన' కార్యక్రమం

వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా 'స్పందన'
కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న
'స్పందన' కార్యక్రమాన్ని ప్రకాశం
జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వినూత్నంగా
నిర్వహిస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు,
సర్కిల్ ఆఫీస్‌లు మరియు డిఎస్పీ కార్యాలయాల్లో నిర్వహించే 'స్పందన' కార్యక్రమాన్ని ఎస్పీ తన కార్యాలయం నుండే
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించి ఫిర్యాదు దారుతో మాట్లాడి పరిష్కారానికి
తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు సూచనలు ఇస్తున్నారు. రాష్ట్రంలోనే సాంకేతిక
పరిజ్ఞానాన్ని వినియోగించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నారు. ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేయాలి అనుకునే వారికి సుదూర ప్రాంతాల
నుండి ఎస్పీ కార్యాలయానికి వ్యయ, ప్రయాసలు పడి రాకుండా
వారికి దగ్గరలో వున్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్పీతో నేరుగా వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి తమ ఫిర్యాదులను చేసుకునే వెసులబాటు కల్పించారు.
ఫిర్యాదు ఇచ్చిన అర్జీదారులకు పోలీస్ స్టేషన్‌లోనే కో-ఆర్డినేషన్ సెల్ ద్వారా
రసీదులనకు అందించేలా చర్యలు తీసుకున్నారు. ఎస్పీ నిర్వహిస్తున్న వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా స్పందన కార్యక్రమానికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను
అందుకున్నారు.