యూనిట్
Flash News
ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలి

ప్రజా
శ్రేయస్సే పరమావధిగా భావించి... సమస్యలపై సత్వరమే స్పందించాల్సిన అవసరం మనపై ఉందని
11వ పటాలము కమాండెంట్ ఎన్.శ్రీనివాసరావు
అన్నారు. పటాలములో హెడ్ కానిస్టేబుళ్లకు వారం రోజుల శిక్షణా కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుళ్ళు విధులలో నిర్వర్తించాల్సిన వాటిపై సవివరంగా
వివరించారు. శిక్షణ అనంతరం అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగి అభినందించారు.
కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ కె. ప్రభుకుమార్, ఆర్.ఐ.
ఆర్.ప్రభాకర్, ఆర్.ఎస్.ఐ. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.