యూనిట్
Flash News
విజయనగరంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
విజయనగరం పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి జెండా ఎగరవేసి అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. అనంతరం శ్రావణి పోలీస్ వెల్ఫేర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు వెళ్లి అక్కడ జెండా ఎగరవేసి పాఠశాల విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసారు. గణతంత్ర దినోత్సవం సందర్భముగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతులు అందజేసారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కుమారి ఎన్ శ్రీదేవి, ఓ ఎస్ డి జె. రామ్ మోహన రావు, డీఎస్పీలు సి ఎం నాయుడు, ఎల్ శేషాద్రి, ఎల్ మోహన రావు, పి వీరాంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.